ప్రముఖ నటి రాణీ ముఖర్జీకి మాతృ వియోగం

127చూసినవారు
ప్రముఖ నటి రాణీ ముఖర్జీకి మాతృ వియోగం
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి కృష్ణా ముఖర్జీ (75) కన్నుమూశారు. ఈ విషయాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ దుఃఖ సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేసింది. కృష్ణా ముఖర్జీ గతంలో 'Teesri Aankh' వంటి పలు బాలీవుడ్ చిత్రాలకు పాటలు పాడారు. రాణీ ముఖర్జీ 2014లో దర్శకుడు ఆదిత్య చోప్రాను వివాహం చేసుకున్నారు. ఆమె మరణానికి గల కారణాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్