
ట్రంప్‌కు చుక్కలు చూపిస్తున్న US కంపెనీలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా నిబంధనలను కఠినతరం చేసిన నేపథ్యంలో, అనేక అమెరికన్ కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను భారతదేశానికి తరలిస్తున్నాయి. దీనివల్ల భారతీయ టాలెంట్ కు అమెరికా వీసాల కోసం కష్టపడాల్సిన అవసరం తగ్గుతుందని, అదే సమయంలో భారతదేశంలో కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆర్థికవేత్తలు, పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డెలాయిట్, అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, జేపీ మోర్గన్, వాల్ మార్ట్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి.




