రవి, శ్రీయ తివారి జంటగా నటించిన విచిత్ర సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని త్వరలో థియేటర్లకు రానుంది. సైఫుద్దీన్ మాలిక్ దర్శకత్వంలో సిస్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అమ్మ ప్రేమ, త్యాగం, కుటుంబ బంధం నేపథ్యంగా హృదయాన్ని తాకేలా రూపొందించామని దర్శకుడు తెలిపారు. జ్యోతి అపూర్వ, బేబీ శ్రీ హర్షిణి యసిక, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రలు పోషించగా, నిజాని సంగీతం అందించారు.