బిహార్‌లో విజయం మాదే.. బెంగాల్‌లోనూ గెలుస్తాం: కేంద్ర మంత్రి

14065చూసినవారు
బిహార్‌లో విజయం మాదే.. బెంగాల్‌లోనూ గెలుస్తాం: కేంద్ర మంత్రి
బిహార్‌ ఎన్నికల్లో ఎన్డీయే విజయం ఖాయమని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అన్నారు. 243 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతుండగా ఎన్డీయే 199 స్థానాల్లో ఆధిక్యం దక్కించుకోవడం ప్రజల తీర్పుకి నిదర్శనమన్నారు. బిహార్‌ అభివృద్ధిని కోరుకుని ఓటర్లు అవినీతి, అరాచకానికి నో చెప్పారని తెలిపారు. త్వరలోనే బెంగాల్‌లో కూడా ఎన్డీయే అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అక్కడి ఎన్నికల్లోనూ బీజేపీ విజయం అనివార్యమని అన్నారు.

సంబంధిత పోస్ట్