ఒమన్‌పై విజయం.. రైజింగ్‌ స్టార్స్ ఆసియా కప్‌ సెమీస్‌కు భారత్ A

11చూసినవారు
ఒమన్‌పై విజయం.. రైజింగ్‌ స్టార్స్ ఆసియా కప్‌ సెమీస్‌కు భారత్ A
రైజింగ్ స్టార్స్‌ ఆసియా కప్ 2025 టోర్నీలో భారత్ A జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకుంది. లీగ్ స్టేజ్‌లో ఒమన్‌పై భారత్ A ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 20 ఓవర్లలో 135 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో భారత్ A 17.5 ఓవర్లలో 138 పరుగులు చేసి గెలుపొందింది. హర్ష్ దూబె 53* పరుగులు చేయగా, నమన్ ధిర్ 30, నెహాల్ వధేరా 23 పరుగులు చేశారు. ఈ విజయంతో భారత్ A గ్రూప్ B నుంచి సెమీస్‌కు చేరగా, పాకిస్థాన్ కూడా నాకౌట్‌కు చేరుకుంది. యూఏఈ, ఒమన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

సంబంధిత పోస్ట్