VIDEO: మద్యం మత్తులో ముగ్గురిపైకి దూసుకెళ్లిన కారు!

5చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక పెట్రోల్ పంప్ వద్ద అతివేగంతో వచ్చిన కారు అక్కడ ఉన్న ముగ్గురిపైకి తీవ్రస్థాయిలో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ తీవ్ర మద్యం మత్తులో ఉండటం వల్లే వాహనం అదుపుతప్పి ఈ ఘటన జరిగిందని పెట్రోల్ పంప్ మేనేజర్ తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్