VIDEO: ఏకాంతం కోసం ఊరి చివరికి వెళ్లిన ప్రేమజంట.. ఇంతలో..

36766చూసినవారు
ఏపీలోని నంద్యాల జిల్లా శివారులో ప్రేమ జంటపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఓ ప్రేమ జంట ఏకాంతం కోసం నగర శివారుకు వెళ్లగా, గమనించిన దుండగులు వారిని బెదిరించారు. యువతిపై దాడి చేసి ఆమె మెడలోని బంగారు చైన్‌ను లాక్కెళ్లారు. దీనిపై ప్రేమ జంట పోలీసులకు కంప్లైంట్ చేయగా.. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ కేసును ఎస్పీ సీరియస్‌గా తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్