VIDEO: కారు ఢీకొని ఏఎస్ఐ దుర్మరణం!

17చూసినవారు
జమ్ముకశ్మీర్‌లోని గంగ్యాల్ జాతీయ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన ఒక కారు మోటార్ సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఏఎస్ఐ కరమ్‌జీత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో మరో ప్రయాణికుడు కూడా గాయపడగా, ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్