AP: తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఎన్నడూ లేని విధంగా, కపిలతీర్థం పుష్కరిణిలో స్నానం ఆచరించేందుకు తమను అనుమతించడం లేదంటూ టీటీడీ వైఖరిపై వారు మండిపడ్డారు. భక్తులు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.