ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. లలిత్‌పూర్-జఖౌరా రహదారిపై దైల్వారా గ్రామం సమీపాన రోడ్డుకు అడ్డంగా కట్టిన తాడు మెడకు చుట్టుకోవడంతో 45 ఏళ్ల మోటార్ సైకిలిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడు. దైల్వారా గ్రామానికి చెందిన బాధితుడు లలిత్‌పూర్ నుంచి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సిసిటీవీ కెమెరాలో నిక్షిప్తమై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.