ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా నంద్ ప్రయాగ్ ఘాట్ తిరాహా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హేమకుండ్ సాహిబ్ యాత్రను ముగించుకుని బైక్‌పై తిరుగుప్రయాణమైన 19 ఏళ్ల నిహంగ్ సిక్కు యాత్రికుడు షేర్ బాబా ప్రమాదంలో దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.