మహారాష్ట్రలోని ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం ఓ ప్రైవేట్ బస్సులో హఠాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఖలాపూర్ సమీపంలో పుణే వైపు వెళ్తుండగా బస్సులో మంటలు చెలరేగాయి. సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేయడంతో, అందులోని 14 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం కానీ, గాయాలు కానీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.