రన్నింగ్ బస్సులో డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేయడంతో తల్లి చేతిలో ఉన్న చిన్నారి ఎగిరి రోడ్డుపై పడిన భయంకరమైన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణించేటప్పుడు చిన్నపిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, డ్రైవర్లు కూడా జాగ్రత్తగా వాహనాలు నడపాలని నెటిజన్లు అంటున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.