యూపీలోని బాందా జిల్లాకు చెందిన ఒక మహిళ, హమీర్‌పూర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పవన్ కనౌజియాపై సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత ఐదేళ్లుగా తనను శారీరకంగా వాడుకున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. కేవలం అత్యాచారమే కాకుండా, తన వద్ద నుండి రూ.2 లక్షల నగదు, రూ.1.5 లక్షల విలువైన ఆభరణాలను కూడా అతను కాజేశాడని ఆమె వాపోయింది. న్యాయం కోసం తాను ఎన్ని కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె కన్నీరుమున్నీరవుతోంది.