AP: నంద్యాల జిల్లా, డోన్ పట్టణంలోని శ్రీరాంనగర్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు జరిగింది. మద్యం మత్తులో ఆచారి అనే ఓ కానిస్టేబుల్ హెల్మెట్, ముసుగు ధరించి, అంగట్లో కూర్చున్న ఒక మహిళ మెడలోని ఐదు తులాల బంగారు గొలుసును లాక్కోవడానికి యత్నించాడు. అనంతరం అతను పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.