AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 6-8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శనివారం 76,820 మంది స్వామిని దర్శించుకోగా, 24,368 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు వచ్చిందని టీటీడీ ప్రకటించింది.