మహారాష్ట్రలోని ముంబై, కుర్లా ప్రాంతంలోని ఎంఐజీ కాలనీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంటి కిటికీ వద్ద చిన్నారులు కూర్చుని ఆడుకుంటుండగా, అకస్మాత్తుగా కిటికీకి ఉన్న భద్రత గ్రిల్ ఊడిపోయి కింద పడిపోయింది. అదృష్టవశాత్తూ చిన్నారులు లోపలికి పడిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.