
ప్రేయసిని కాల్చి చంపి.. ప్రియుడు ఆత్మహత్య
ఢిల్లీలోని బురారీ పరిధిలో గల కమాల్పూర్ ప్రాంతంలో ప్రేమించుకుంటున్న నిఖిల్, శుభాంగి అనే యువతీయువకుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రియురాలు శుభాంగిని నిఖిల్ తుపాకీతో కాల్చి చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఇద్దరూ ఒకే గదిలో మృతదేహాలుగా కనిపించారు. ఇంటి యజమాని సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




