సొంత గడ్డ పంజాబ్‌లో గిల్ శతకం బాది గుజరాత్ టైటాన్స్‌కు విజయాన్ని అందించడంతో అతని తండ్రి లఖ్విందర్ సింగ్ ఆనందానికి అవధులు లేవు. నిన్న స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న ఆయన, గిల్ శతకం బాదగానే లేచి తొడగొట్టారు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చి కొడుకుని గట్టిగా హగ్ చేసుకుని అభినందించారు. గిల్ తల్లి కీర్త్ కూడా కుమారుడి విజయం చూసి గర్వపడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.