జార్ఖండ్‌లోని జమ్షెడ్పూర్ గోల్మురి కెనరా బ్యాంక్‌లో గురువారం సాయుధ ముఠా ఘోర దోపిడీకి పాల్పడింది. ఐదుగురు సాయుధ దుండగులు బ్యాంక్‌లోకి చొరబడి ఉద్యోగులను బందీలుగా చేశారు. అనంతరం రూ.36 కోట్ల విలువైన 23 కిలోల బంగారం, రూ.43 లక్షల నగదుతో పారిపోయారు. రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన అత్యంత భారీ దోపిడీ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.