వెనిజులాలో ఒక రద్దీ మెట్రో స్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పోలీసు అధికారి మాట్లాడుతుండగా అతని సర్వీస్ రివాల్వర్ ప్రమాదవశాత్తూ పేలింది. ఈ దుర్ఘటనలో అక్కడే ఉన్న 22 ఏళ్ల యువతి పొత్తికడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.