తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటిలాగే చాలాచోట్ల మధ్యాహ్నం వరకు 40+ డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆపై వాతావరణం చల్లబడటంతో ఏపీలోని మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలోని రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కూడా వర్షం కురిసింది. దీంతో ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు.