ఇవాళ (సెప్టెంబర్ 9) కార్గిల్ యుద్ధ వీరుడు, కెప్టెన్ విక్రమ్ బాత్రా జయంతి. 1997లో భారత సైన్యంలో లెఫ్టినెంట్‌గా చేరిన విక్రమ్ బాత్రా, 1999లో కార్గిల్ యుద్ధంలో కమాండింగ్ ఆఫీసర్‌గా తన బలగాలను నడిపించారు. అత్యంత క్లిష్టమైన పాయింట్ 5140ను శత్రువుల నుంచి స్వాధీనం చేసుకుని "షేర్షా రిపోర్టింగ్! యే దిల్ మాంగే మోర్" అని మెసేజ్ ఇచ్చారు. ఆ తర్వాత పాయింట్ 4875ను స్వాధీనం చేసుకునే మిషన్‌లో ఓ సైనికుడిని రక్షించే ప్రయత్నంలో వీరమరణం పొందారు.