VIDEO: చికెన్ కర్రీలో బల్లి కళేబరం

18చూసినవారు
TG: ఖమ్మం జిల్లా లోని ఎదులాపురం- కోదాడ క్రాస్ రోడ్డులోని ఓ దాబాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చికెన్ కర్రీలో బల్లి కళేబరం కలకలం సృష్టించింది. ఈ ఘటనతో షాక్ అయిన కస్టమర్లు హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్టమర్లకు, హోటల్ నిర్వాహకులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో హోటల్ నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్