VIDEO: సైకిల్ తొక్కిన మహారాష్ట్ర సీఎం సతీమణి అమృతా ఫడణవీస్

18చూసినవారు
ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధనాన్ని పొదుపుగా వాడాలని మహారాష్ట్ర సీఎం సతీమణి అమృతా ఫడణవీస్ నిర్ణయించుకున్నారు. పెట్రోల్, డీజిల్ ఆదా చేయడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఆమె సైకిల్ తొక్కడం ప్రారంభించారు. 5-7 కిలోమీటర్ల పరిధిలోని పనులన్నింటికీ సైకిల్ పైనే వెళ్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. అర్థవంతమైన మార్పులు సాధారణ ఎంపికలతోనే మొదలవుతాయని పేర్కొంటూ సైకిల్ పై వెళ్తున్న వీడియోను ఆమె షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్