VIDEO: వ్యక్తిపై దాడి చేసి వాహనం ధ్వంసం

0చూసినవారు
పుణేలోని కొల్వాడి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిపై తీవ్రంగా దాడి చేసి పరారైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాడి సమయంలో నిందితులు బాధితుడి వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. లోనికంద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దాడికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్