అమెరికాలో హత్యకు గురైన ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ ముమ్మరంగా దర్యాప్తు చేపట్టింది. కిర్క్ ప్రసంగిస్తున్న ప్రదేశానికి 100 గజాల దూరంలో ఉన్న భవనం రూఫ్‌టాప్ నుంచి కాల్పులు జరిపినట్లు అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో ఆ భవనంపై దుండగుడు దాక్కున్న దృశ్యాలు వీడియోల్లో రికార్డు కావడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.