యూపీలోని మీరట్‌లో తాజాగా దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక మైనర్ బాలిక తన సవతి తండ్రి, సొంత అన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణ చేసింది. ఆమెతో తన సవతి తండ్రి, సొంత అన్నయ్య పగలూ రాత్రీ అసభ్యకరంగా ప్రవర్తిస్తారని తెలిపింది. వంట చేసేటప్పుడు కూడా నన్ను వదలరు.. అని ఆ బాలిక వాపోయింది. తల్లి పనికి వెళ్లినప్పుడు సవతి తండ్రి ఈ దారుణమైన చర్యలకు పాల్పడేవాడని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.