నేపాల్లో భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరదల్లో కొట్టుకుపోయిన పలువురు చావు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడుతున్నారు. ఈ క్రమంలో ఇల్లు, కుటుంబం, సర్వస్వం కోల్పోయి కొండ ప్రాంతంలో చిక్కుకుపోయిన ఓ మహిళను ఆర్మీ జవాన్లు సురక్షితంగా రక్షించారు. కళ్ల ముందే జరిగిన విధ్వంసాన్ని చూసి ఆమె తీవ్ర షాక్లో ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ మహిళ పరిస్థితి నేపాల్లో వరదల తీవ్రతను కళ్లకు కడుతోంది. ఇంకా ఎంతమంది ఇలా సాయం కోసం ఎదురుచూస్తున్నారోనన్న ఆలోచన ఆందోళన కలిగిస్తోంది.