AP: తుఫాన్ తీరం దాటినప్పటికీ, ఏపీలోని పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఏలూరు, పశ్చిమ, తూర్పు గోదావరి, జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. అటు తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. వాతావరణ నిపుణుల కథనం ప్రకారం, తుఫాన్ బుధవారం ఉదయానికి వాయుగుండంగా, మధ్యాహ్నానికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడటమే దీనికి ప్రధాన కారణం. తుఫాన్ నెమ్మదిగా కదలడం వల్ల సముద్రం నుండి వీస్తున్న తేమ గాలులు ప్రభావం చూపడం వల్లే ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయని నిపుణులు విశ్లేషించారు.