VIDEO: ఇసుక లోడుతో వంతెనపై చిక్కుకున్న ట్రక్కు

15చూసినవారు
అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజా జిల్లా, క్రౌటీ వద్ద లోహిత్ నదిపై ఉన్న 'బెయిలీ వంతెన' ప్రమాదకరంగా మారింది. పరిమితికి మించి ఇసుక లోడుతో వెళ్లిన భారీ ట్రక్కు వంతెన మధ్యలో చిక్కుకుపోవడంతో ప్రధాన నిర్మాణం దెబ్బతింది. దీంతో భారత్-చైనా సరిహద్దు సమీపంలోని కహో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వెంటనే హెచ్చరికలు జారీ చేసి, వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం అత్యవసర మరమ్మతులు ప్రారంభమయ్యాయి.

సంబంధిత పోస్ట్