యూపిలోని నోయిడాలో దారుణ ఘటన జరిగింది. గుల్షన్ మాల్‌లో సినిమా చూస్తున్న సమయంలో తలెత్తిన వివాదం కారణంగా, నలుగురు వ్యక్తులు ఇద్దరు యువకులపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. సినిమా చూసే సమయంలో చిన్న వివాదం మొదలైంది. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు ఇద్దరు యువకులను చితకబాదారు. ఈ దాడి ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులపై దర్యాప్తు చేస్తున్నారు.