VIDEO: కల్వర్టును ఢీకొని దూసుకెళ్లిన వ్యాన్.. 16 మందికి గాయాలు!

0చూసినవారు
AP: కృష్ణా జిల్లా, బంటుమిల్లి మండలం పెందుర్తి వద్ద శుక్రవారం ఉదయం అంతర్వేది తీర్థానికి వెళ్లి వస్తుండగా ఒక మినీవ్యాన్ కల్వర్టును ఢీకొని బోదెలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నాగాయలంక మండలం సొర్లగొందికి చెందిన 16 మంది గ్రామస్థులు గాయపడ్డారు. వీరిలో కొందరికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్