VIDEO: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్

40చూసినవారు
రైలు ముందు ప్రమాదకరంగా డ్యాన్స్‌ చేసిన ఓ మహిళ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో రైల్వే పట్టాలపై నిల్చున్న ఆమె.. తన చీర కొంగును రైలు ఇంజిన్‌కు కట్టి, కెమెరా వైపు చూస్తూ పాటకు లిప్‌సింక్‌ చేస్తూ డ్యాన్స్‌ చేసింది. ఈ దృశ్యాలపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. లైక్స్‌, వ్యూస్‌ కోసం ఇలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడటం సరికాదని సూచించారు. వీడియో ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించారనే వివరాలు తెలియరాలేదు. రైలు ఆగి ఉన్నా పట్టాలపైకి వెళ్లడం, రైలు సమీపంలో స్టంట్స్‌ చేయడం ప్రమాదకరమని పలువురు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్