VIDEO: ఆర్డర్ ఆలస్యంగా ఇచ్చారని.. వేడి కాఫీ పోసిన మహిళ!

58చూసినవారు
అమెరికాలోని మిచిగాన్లో, శాండ్‌విచ్ డెలివరీ ఆలస్యమైందని కోపంతో ఒక మహిళ రెస్టారెంట్ మేనేజర్‌పై కేకలు వేసింది. అంతేకాక, తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనికి నిరాకరించిన మెక్‌డొనాల్డ్స్ మేనేజర్‌పై వేడి కాఫీ పోసింది. ఈ ఘటనను మరో కస్టమర్ రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయింది. ఈ దాడిలో మేనేజర్ స్వల్పంగా గాయపడ్డారు.