మహిళల భద్రత విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా యూపీలోని ఝాన్సీలో ఇంటి బయట తల్లితో పాటు నిల్చున్న యువతిని ఇద్దరు ఆకతాయిలు లైంగికంగా వేధించారు. బైక్ పై వచ్చి సదరు యువతిని అసభ్యంగా తాకారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ వీడియోను పరిశీలించి పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అనంతరం తమదైన శైలిలో పోకిరీలకు దేహశుద్ధి చేసినట్లు సమాచారం.