VIDEO: ప్రియుడి కోసం టవర్ ఎక్కిన యువతి

36చూసినవారు
ప్రేమ కోసం ఏదైనా చేస్తామనే దానికి ఈ ఘటనే నిదర్శనం. ఏడేళ్లుగా సాగుతున్న ప్రేమాయణంలో, అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్ళిన ప్రియుడిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తన ప్రియుడిని అరెస్ట్ చేశారని తెలిసిన ప్రేయసి, వెంటనే గ్రామంలోని హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేసింది. అతడిని విడుదల చేస్తేనే కిందకు దిగుతానని భీష్మించుకోవడంతో పోలీసులు, అధికారులు పరుగులు తీశారు. చివరకు ప్రియుడిని అక్కడికి తీసుకురావడంతో ఈ హైవోల్టేజ్ డ్రామా సుఖాంతమైంది

సంబంధిత పోస్ట్