తమిళనాడులోని కరూర్‌లో శనివారం తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 39 మంది మృతి చెందగా.. వారికి టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగ్రాతులకు రూ.2లక్షలు ప్రకటించారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక సీఎం స్టాలిన్ సైతం మృతి చెందిన కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.