టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికల వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న వీరి వివాహం రాజస్థాన్ ఉదయ్‌పూర్ కోట వేదికగా జరగనున్నట్లు సమాచారం. కాగా అక్టోబర్ 3న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇరు కుటుంబాలు స్పందించలేదు.