
కోల్డ్రిఫ్ సిరప్‌ను బ్యాన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
TG: రాష్ట్ర ప్రభుత్వం కోల్డ్రిఫ్(COLDRIF) సిరప్‌ను బ్యాన్ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో Coldrif సిరప్ తాగిన పిల్లలు చనిపోవడంతో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని sresan ఫార్మా కంపెనీ తయారు చేసిన ఈ సిరప్ తాగడం వల్ల RJ, MP రాష్ట్రాల్లో 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ సిరప్‌ను తెలంగాణలో నిషేధిస్తూ DCA ఉత్తర్వులు జారీ చేసింది.




