తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేత విజయ్‌పై నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) సమన్వయకర్త సీమాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కరూర్ రోడ్‌షోలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించి, వందమందికిపైగా గాయపడటానికి విజయ్ నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. సెప్టెంబర్ 27న సేలంలో జరగాల్సిన రోడ్‌షోను కరూర్‌కు మార్చడం, ఆలస్యంగా వెళ్లడం వల్లే దుర్ఘటన జరిగిందని సీమాన్ అన్నారు. కరూర్ దుర్ఘటనపై సీబీఐ విచారణపై తనకు నమ్మకం లేదని, టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ బెయిలు పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడం వెనుక రహస్యం ఏమిటని ప్రశ్నించారు.