విజయ్, రష్మిక దంపతులు తమ అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో ఫ్యాన్స్ కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేసి, వారే స్వయంగా వడ్డించి అందరినీ మురిపించారు. విందు అనంతరం అభిమానులతో సరదాగా ముచ్చటించిన ఈ 'విరోష్' జోడీ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా రేపు సినీ, రాజకీయ ప్రముఖుల కోసం వీరు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.