తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన సతీమణి సంగీత సోర్నలింగం బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. చెన్నై రాజకీయ వర్గాల్లో ఈ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు కూడా విజయ్ వ్యక్తిగత జీవితంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. అప్పట్లో సంగీత తన భర్తకు ఓ నటితో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించి, విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయాలపై విజయ్ కుటుంబం ఎప్పుడూ స్పందించలేదు. విజయ్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ ప్రచారం జరుగుతోందనే వాదనలు కూడా అప్పట్లో వినిపించాయి.