తమిళనాడు నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి గుర్తింపు లేదని ఎన్నికల సంఘం (ఈసీ) మద్రాసు హైకోర్టుకు తెలియజేసింది. కరూర్ ర్యాలీ తొక్కిసలాట కేసు విచారణ సందర్భంగా ఈ విషయం వెల్లడైంది. నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా అర్హత సాధించే ప్రమాణాలను టీవీకే అందుకోలేదని ఈసీ న్యాయవాది తెలిపారు. ఒక రాజకీయ పార్టీ గుర్తింపు పొందాలంటే పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు, అసెంబ్లీలో రెండు సీట్లు లేదా లోక్‌సభలో ఒక సీటు సాధించాలనే ప్రమాణాలను ఈసీ నిర్దేశించింది.