తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్, ఢిల్లీ పర్యటన అనంతరం చెన్నైకి తిరిగి వస్తున్నప్పుడు విమానంలో ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షితో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ అందరితో కలిసిపోవడం, సాధారణ ప్రజలతో హుందాగా వ్యవహరించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోను ఉమా మీనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, "గౌరవ ముఖ్యమంత్రి శ్రీ సి. జోసెఫ్ విజయ్ (మన దళపతి) మా ఫ్లైట్‌లో ప్రయాణించడం వల్ల ఈరోజు నా క్రూ డ్యూటీ ఎంతో స్పెషల్‌గా మారింది" అని పేర్కొన్నారు.