ప్రధాని మోడీ, రాహుల్ గాంధీకి.. టీవీకే అధినేత విజయ్ ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు అభివృద్ధికి సమిష్టి సహకారం అవసరమని, రాజకీయాలకు అతీతంగా ప్రజాసంక్షేమమే లక్ష్యమని విజయ్ స్పష్టం చేశారు. ప్రజాసేవలో ఉత్తమ ప్రమాణాలకు కట్టుబడి ఉంటామని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తామని విజయ్ హామీ ఇచ్చారు.