నటుడు శ్యామ్, అగ్ర కథానాయకుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసి, ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారని తాను రెండేళ్ల క్రితమే ఊహించానని తెలిపారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, విజయ్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్లు, ప్రజలు ఆయన్ను గౌరవిస్తున్నట్లు తనకు కల వచ్చిందని, మే 3న కూడా తన కల నిజం కాబోతోందని విజయ్‌కు మెసేజ్ చేశానని శ్యామ్ పేర్కొన్నారు. ఏదో ఒక దైవశక్తి విజయ్‌ను నడిపిస్తోందని, రాజకీయ సింహాసనం ఆయనకే చెందుతుందని తాను నమ్ముతున్నానని, సినిమా కెరీర్‌ను వదులుకుని ఎవరూ ఇలా రారని శ్యామ్ అన్నారు.