TG: ప్రభుత్వ డెయిరీ సంస్థ అయిన విజయ డెయిరీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 400 కొత్త డెయిరీ పార్లర్లను ప్రారంభించాలని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య నిర్ణయించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు కీలక ప్రాంతాల్లో ఈ పార్లర్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుండగా.. త్వరలో జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయనుంది. వీటికోసం ముందుగా రూ.25 వేల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు పరిశీలించి పార్లర్ మంజూరు చేస్తారు. వీటిద్వారా నెలకు రూ.30-50 వేల వరకు సంపాదన వస్తుంది.