
ఎయిమ్స్‌లో 1,484 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థలు, అనుబంధ కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో 1,484 నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రూప్-బీ, గ్రూప్-సీ కేటగిరీలకు చెందిన ఈ నియామకాలు కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ (CRE-2026) ద్వారా చేపట్టనున్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు వివిధ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు జులై 3, 2026లోపు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి.
































