
చైనా మాంజా తగిలి వ్యక్తికి గాయాలు
యాచారం: బైక్ పై వెళ్తున్న వ్యక్తి చైనా మాంజా తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. నల్గొండ జిల్లా తిరుమలగిరికి చెందిన సభావల్ మధు శుక్రవారం హైదరాబాద్ నుంచి తిరుమలగిరికి బైక్ పై వెళ్తున్నారు. మార్గ మధ్యలో సాగర్ హైవేపై మాల్ మార్కెట్లో విద్యుత్ స్తంభానికి వేలాడుతున్న చైనా మాంజా చేతి వేళ్లకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తించిన స్థానికులు యాచారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్షతగాత్రుడిని అస్పత్రికి తరలించి.. చైనా మాంజా విక్రయిస్తున్న వ్యాపారి వివరాలపై ఆరా తీశారు.







































